- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ, ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలు నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
- Advertisement -


