Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం స్థలం అప్పగింత

డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం స్థలం అప్పగింత

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడంలో సహకరించిన వారికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణు ప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజియుద్దీన్ అస్లాం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుండ్రోత్ నడిపి పోశెట్టి, వీడీసీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -