Tuesday, January 20, 2026
E-PAPER
Homeఖమ్మంమహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు

మహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు

- Advertisement -

ఐద్వా జాతీయ మహాసభలు సందర్భంగా జెండా, వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత
నవతెలంగాణ – బోనకల్ 

మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐద్వా పోరాటాలు నిర్వహిస్తుందని ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్లులో ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనమునందు ఐద్వా పతాకాన్ని ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఐద్వా నాయకురాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ సునీత మాట్లాడుతూ.. ఈనెల 25వ నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ మహానగరంలో జరగనున్న ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని కోరారు.

ఐద్వా జాతీయ మహాసభలు సందర్భంగా ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ మహానగరంలో జరిగే బహిరంగ సభకు ఇంటికో మహిళ ఊరుకో వాహనం కదలి రావాలని పిలుపునిచ్చారు. ఐద్వా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సుదీర్ఘ కాలము నుంచి పోరాటాలు చేస్తుందన్నారు. మహిళలకు అండగా ఉండేది ఐద్వా మాత్రమేనన్నారు. ప్రభుత్వాలు కోర్టులు చేయలేని అనేక మహిళ సమస్యలను ఐద్వా పరిష్కారం చేసిందన్నారు. మహిళలకు హయత్వా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుందన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై సంఘటనలు జరిగిన రోజు మాత్రమే స్పందిస్తూ ఆ తర్వాత ఆ సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. సమాజంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పాలకులు సరిగా స్పందించడం లేదన్నారు. మహిళా చట్టాలను సమగ్రంగా చేయవలసిన పాలకులు అవి చేయకుండా అప్పుడుకప్పుడు తుతూమంత్రంగా ఏవోవో చర్యలు తీసుకుంటూ ఆ సంఘటనలను వదిలేస్తున్నారన్నారు. సమాజంలో పురుషుడితో పాటు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అయినా వేధింపులు ఆగటం లేదన్నారు.

పని ప్రదేశంలో కూడా మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలు సమస్యలపై సంగటితంగా పోరాటాలలోకి రానంత కాలం మహిళలు ఇటువంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు అన్నారు. ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మధిర డివిజన్ కమిటీ సభ్యులు తెల్లాకుల రజని, ధరావతు సునిత, నల్లమోతు వాణి, నాయకురాలు దారెల్లి పద్మ ,ఆళ్ల పుల్లమ్మ, దారెల్లి నాగేంద్రం, మార్కపుడి రజని, బోయినపల్లి లక్ష్మి, నోముల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -