Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు సన్మానం

కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను మంగళవారం ఘనంగా సత్కరించారు. గ్రామ శివారులోని శుక్రవారం దేవి ఆలయం వద్ద నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో నూతనంగా కమ్మర్ పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అల్గొట్  రమేష్, కోశాధికారి యెనుగందుల శశిధర్, జిల్లాలో సీనియర్ కెమిస్ట్, జిల్లా అసోసియేషన్ గౌరవ సలహాదారు అన్నం గణపతి రామ్ లను సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అల్గొట్ రమేష్ మాట్లాడుతూ గత 2025 సంవత్సరం ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు శంకర్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైనట్లు తేలడంతో సభ్యుల డిమాండ్ మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సభ్యుల ఏకగ్రీవ ఆమోదం మేరకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు రమేష్ తెలిపారు. తనపై నమ్మకంతో కమ్మర్ పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ సభ్యులు భోగ రామస్వామి, ఈర్నాల నవీన్, గుడ్ల నవీన్, చైతన్య, సాయి చరణ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -