Tuesday, January 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం  మండల కేంద్రంలోని మేదరి వాడలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా వేద పండితులు గుండి గణేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జక్కు భూమేష్ మాట్లాడుతూ .. వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం అంటే, అహింస, సామాజిక న్యాయం కోసం వాసవి కన్యకా పరమేశ్వరి అగ్నిలో ప్రవేశించి తన భౌతిక దేహాన్ని త్యజించి, భగవంతునిలో ఐక్యమైన రోజును ఆర్యవైశ్యులు, భక్తులు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఆర్యవైశ్య ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మల్యాల కిరణ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు సత్తయ్య,వుత్తూరి ప్రభాకర్, గౌరిశెట్టి నారాయణ, లచ్చన్న మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -