నవతెలంగాణ – మెండోర
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు సావెల్ గ్రామంలో
పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 2.15 కోట్లు మంజూరు అయిన సిఆర్ఆర్ నిధులతో సావెల్ గ్రామం నుంచి తడపాకల్ రోడ్డు బిటి రోడ్డు పనులు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. శంకుస్థాపన అనంతరం 10:30 గంటలకు ఆర్మూర్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
సీతక్కకు స్వాగతం పలుకనున్న కాంగ్రెస్ నాయకులు
బుధవారం ఉదయం పది గంటలకు సావెల్ గ్రామంలో పర్యటించనున్న సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉదయం 9:30 గంటలకు సోన్ బ్రిడ్జ్ చాకిర్యాల్ X రోడ్ వద్దకు చేరుకుని మంత్రి సీతక్క కు ఘన స్వాగతం పలుకుతారు.



