Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె ప్రకృతి వనాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

పల్లె ప్రకృతి వనాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్, ఆవల్గావ్, కొడిచర, గ్రామాల్లో మంగళవారం మండల ప్రత్యేక అధికారి మోహన్ రావు ఎంపీడీవో రాణి, ఎంపీవో వెంకట నరసయ్య ఏపీవో, పద్మ సందర్శించి ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వారు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రత్యేక అధికారి సూచించినట్లు తెలిసింది. అధికారుల పర్యటనలతో ఆయా గ్రామాల సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు అధికారులు ఆదేశాల మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని తెలిపారు. అధికారుల గ్రామాల సందర్శన పనులపై పరిశీలన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మరింతగా ముందుకు సాగేలా కృషి చేస్తామని సర్పంచులు అధికారులతో మాట్లాడుతూ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -