నవతెలంగాణ – ఆలేరు టౌను
పేదరిక నిర్మూలన కొరకు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫి శాఖామంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇందిరా మహిళా శక్తి పథకం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఆలేరు పట్టణంలో వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించారు.
అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, డిఆర్డిఓ కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ.. 427 గ్రామాలకు రెండు లక్షల పై చీలుకు చీరలు మహిళలకు పంపిణీ చేశామన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 375 సంఘాలు ఉన్నాయని తెలియజేశారు. ఒక రూపాయి వడ్డితో ప్రయోజనాలు, డిసెంబర్ 23 సంవత్సరం నుండి రూ.78 లక్షలు, 87 వేల 160 ఖాతాలలో పడ్డాయి. పొదుపుతోపాటు, జమ చేసిన డబ్బులు, తిరిగి మీ విఎల్ఎ ఫ్, టిఎల్ఎఫ్ సంఘాలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పూర్తిస్థాయిలో చీరలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, తాసిల్దార్ వి ఆంజనేయులు, పురపాలక కమిషనర్ బి శ్రీనివాస్, మేనేజర్ జగన్మోహన్, వి బి కే లు, పురపాలక సిబ్బంది, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



