కార్తిక్ రాజు, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్త గారు పెట్లే’. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కష్ణ నిర్మిస్తున్నారు. రాజా దుస్సా దర్శకుడు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేయగా, ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టారు. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్‌కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ, ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో పాటు ఎమోషనల్‌గానూ ఉంటుంది. 1980లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా నిర్మాత గాలి కష్ణ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను’ అని తెలిపారు. ’80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కథను నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కష్ణ్ణకి థ్యాంక్స్’ అని హీరో కార్తిక్ రాజు చెప్పారు. నాయిక కాజల్ చౌదరి మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కథ చాలా బాగుంటుంది. ఇదొక యూనిక్ స్టోరీ. మంచి టీంతో పని చేస్తున్నాను. ఈ చిత్రంతోనూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతీ, శ్రీధర్ రెడ్డి, ప్రభావతీ, అభరు, ఫణి, పద్మ, కీర్తిలత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొ-ప్రొడ్యూసర్స్ : మల్లవరం వేంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి, సినిమాటోగ్రఫి : గంగానమోని శేఖర్, మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తికేయ శ్రీనివాస్ (వాసు), లైన్ ప్రొడ్యూసర్ : కీసరి నరసింహ, ఆర్ట్ డైరెక్టర్ : రవికుమార్ గుర్రం, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : సుబ్బు.