నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఉప్లూర్ రోడ్డులోని వరద కాలువ వద్ద మంగళవారం కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి యాంటీ డ్రంక్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీని వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డ్రంక్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి విషయాలను ప్రజలకు వివరించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన తరువాత వాహనం నడపకూడదని, తమ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతకు సహకరిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు.
యాంటీ డ్రంక్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -



