Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
కమ్మర్ పల్లి గ్రామాన్ని ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు సర్పంచ్ కొత్త పల్లి హారిక అశోక్ అన్నారు. అందులో భాగంగా పారిశుద్ధ్యం పై ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా, డ్రైనేజీల్లో మట్టి, చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో శుభం చేసే చర్యలు చేపట్టినట్లు  తెలిపారు. గ్రామస్తులు కూడా పరిశుభ్రత గ్రామంగా కమ్మర్ పల్లిని నిలిపేందుకు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -