నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ నుండి వచ్చే పథకాలను రైతులకు అందేలా చూసేందుకు ఏర్పాటుచేసిన ఆత్మ కమిటీ చైర్మన్ గా జంగాపల్లి ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హుస్నాబాద్ రైతు వేదిక కార్యాలయంలో 25 మంది ఆత్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులందరూ జంగాపల్లి ఐలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ జంగాపల్లి ఐలయ్య మాట్లాడుతూ ఆత్మ కమిటీ హుస్నాబాద్ అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల పరిధిలో పనిచేస్తుందని తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులతోపాటు రైతులందరికీ ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నుండి వచ్చే ప్రతి పథకాన్ని రైతుల అందరికీ అందేలా చూస్తానని తెలిపారు.
ఆత్మ కమిటీ చైర్మన్ గా జంగాపల్లి ఐలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



