- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై కొనసాగుతున్న వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించిన సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Advertisement -



