Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సై ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ కార్యక్రమం

ఎస్సై ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో హెచ్ఎం హనుమంత్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడిపే వారు పత్రాలను కచ్చితంగా వెంట ఉంచుకోవాలని అన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడప రాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని తెలిపారు. వాహనాల విషయంలో రిజిస్ట్రేషన్ నంబర్లు మరియు డ్రైవింగ్ లైసెన్సు ,ఇన్సూరెన్స్ పేపర్స్, బండికి సంబంధించిన ప్రతి ఒక్క పత్రాలను వెంటవంచుకోవడం వలన ఎక్కడ సమస్య తలెత్తదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్,  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిననీ విద్యార్థులు, జుక్కల్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -