- Advertisement -
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును కోరని గ్రామ పెద్దలు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని నాగుల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాగల్ గావ్ సర్పంచ్ భర్త జాదవ్ విజయ్ (బాబు) పాటిల్ గ్రామస్తులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగుల్గావ్ గ్రామంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం ఆనందాకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్, సంతోష్ డోంగ్లే, వినోద్ పాంచాల్, మైపత్ పటేల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



