- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రానికి చెందిన దళిత మహిళా మహిళా మాజీ ఎంపీపీ పర్యాగ్ బాయి మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. జుక్కల్ మండలం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి మహిళా ఎంపీపీగా గెలుపొంది ఐదేళ్లపాటు ప్రజాసేవకు అంకితం చేసిన మహిళగా గుర్తింపు పొందారు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో మృతి చెందారని కుటుంబీకులు వెల్లడించారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని అన్నారు.
- Advertisement -



