Tuesday, January 20, 2026
E-PAPER
Homeజిల్లాలుమండల అధికారులను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

మండల అధికారులను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ మంగళవారం మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిలను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని అధికారులను కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -