- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సిట్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో దాదాపు ఏడు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి విచారణలో పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.
- Advertisement -



