– పది శాతం తగ్గింపు అంటూ సగటున 7 శాతమే తగ్గించిన మెట్రో
– అడ్డగోలు దోపీడీపై ప్రయాణికుల విమర్శలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో.. ప్రయాణికులతో దోబూచులాటాడు తోంది. రేట్ల పెంపుపై జిమ్మిక్కులు ప్రయోగిస్తూ.. ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తోంది. మెట్రోకు ఆర్థిక భారం పడుతుందని ఇటీవలే చార్జీలు భారీగా పెంచింది. దాదాపు 20శాతం నుంచి 42శాతానికి పైగా చార్జీలు పెంచింది. ఆ తర్వాత వివిధ వర్గాల ప్రజలు, సీపీఐ(ఎం), తదితర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పెంచిన ధరలపై పదిశాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నా రు. అయితే తాజాగా ఎల్‌అండ్‌టీ మెట్రో విడుదల చేసిన ధరల జాబితా పరిశీలిస్తే.. పది శాతం అని చెప్పి.. సగటున 7శాతం మాత్రమే తగ్గించినట్టు కనిపిస్తోంది. దాంతో మెట్రో తీరుపై ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. పది శాతం అని చెప్పి.. ఏడు శాతానికే తగ్గించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదిశాతం డిస్కౌంట్ కూడా ఎన్నిరో జులు కొనసాగిస్తారో మెట్రో అధికారులు..స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులను ఒకరకమైన అయోమయంలో పడేశారు. మెట్రో అధికారుల తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
చార్జీల పెంపు.. ప్రయాణికులకు భారం..
మెట్రో రైలులో పాత ధరలు పద్ధతిలో ఉండేవి. ఉదాహరణకు 2 కిలోమీటర్ల వరకు రూ.10, 24 కిలోమీటర్ల పైన రూ.60 ఉండేవి. కానీ కొత్త ధరలతో పోల్చితే.. 2 కి.మీకు రూ.12 (20శాతం పెరగ్గా), 24 కిలోమీటర్లపైన రూ.75 (25శాతం పెంపు) అయింది. 9-12 కి.మీ దూరానికి రూ.35 నుంచి రూ.50కి పెరిగి, 42.86శాతం పెరిగింది. రోజువారీ ప్రయాణికులకు ఇది భారంగా మారింది. 9-12 కి.మీ ప్రయాణించే వ్యక్తి నెలకు 20 రోజులు ప్రయాణిస్తే.. రూ.300 అదనంగా ఖర్చవుతుంది. జీవన వ్యయం ఇప్పటికే పెరుగుతున్న హైదరాబాద్ లో ఇది పెద్ద భారమే.
పది శాతం డిస్కౌంట్.. మోసపూరిత వాగ్దానం!
వాస్తవానికి మెట్రో ప్రకటించిన డిస్కౌంట్ చార్జిల్లో నిజం లేదు. ఉదాహరణకు 2-4 కి.మీ దూరానికి కొత్త ధర రూ.18 నుంచి 10శాతం డిస్కౌంట్‌తో రూ.16.20 ఉండాలి.. కానీ రూ.17 ఉంది. అంటే 5.56శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 9-12 కి.మీ దూరానికి రూ.50 నుంచి రూ.45 ఉండాలి. కానీ రూ.47అంటే 6శాతం మాత్రమే వస్తుంది. అన్ని దూరాల్లో డిస్కౌంట్ 5.56శాతం నుంచి 8.33శాతం మధ్య ఉంది.. అంటే 10శాతం కాదు.. ఇది ప్రయాణికులను మోసం చేసినట్టేనని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం..
ధరలు 20శాతం నుంచి 42.86శాతం వరకు పెంచడం.. ఆపై 10శాతం డిస్కౌంట్ అని చెప్పి 7శాతం సగటున ఇవ్వడం మెట్రో నిర్వహణపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రజా రవాణా అందుబాటులో ఉండాలి.. కానీ ఈ ధరల పెంపు సామాన్య ప్రజలకు భారంగా మారింది. ధరలు ఎందుకు పెంచారో స్పష్టత లేదు. పెరిగిన ఖర్చుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వలేదు. ధరల పెంపు ఇలా ఉంటే.. ఒక రకంగా డిస్కౌంట్ వల్ల మెట్రోపై ప్రజల విశ్వాసం తగ్గుతోంది. ధరలు ఎందుకు పెంచారో, డిస్కౌంట్ ఎందుకు సరిగ్గా ఇవ్వలేదో స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
చెప్పింది పది…ఇచ్చింది ఏడే..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES