Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డిపై ఎస్పీకి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్పీకి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ ని, బిఆరెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అవమానపరిచే విధంగా.. బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టమని, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలని వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు.. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలిగించే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. ఎస్పీని కలిసిన వారిలో.. శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -