Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమానవ్వించే 'క్రేజీ కల్యాణం'

నవ్వించే ‘క్రేజీ కల్యాణం’

- Advertisement -

నరేష్‌ వీకే, అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌, రాజ్‌ వెడ్స్‌ రాంబాయి ఫేమ్‌ అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.2గా బూసమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
మంగళవారం వీకే నరేష్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో పర్వతాలు అనే పాత్రలో ట్రెడిషనల్‌గా వీకే నరేష్‌ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈచిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ – సాయి కదిర, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – శ్రీపాల్‌ మాచర్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – అఖిల్‌ సాయి శ్రీమూర్తి, ఎడిటర్‌ – శ్రావణ్‌ కటికనేని, డీవోపీ – శ్యామ్‌ దూపాటి, మ్యూజిక్‌ – సురేష్‌ బొబ్బిలి, స్క్రీన్‌ ప్లే – శ్రీనివాస రవీంద్ర.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -