తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్. ఏ.ఆర్.సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెం చర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ సజీవ్ మీడియాతో ముచ్చటించారు.
ఇది ఒక రీమేక్ స్టోరీ. ’35 చిన్న కథ’ సినిమాకి డైరెక్టర్ నందకిశోర్‌తో కలిసి పని చేశాను. ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో నా సొంత కథ అడిగారు. అయితే రెండు నెలల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లాంటి ఒక పెద్ద టీంతో నా ఫస్ట్ సినిమా చేయటం అదష్టంగా భావిస్తున్నాను.
ఒరిజినల్ కథలోని కోర్ పాయింట్‌ని తీసుకుని తెలుగు సినిమాకి తగ్గట్టు మార్పులు చేశాను. ఇది యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అక్కడికి, ఇక్కడికి కల్చర్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌ని గోదారి ప్రాంతానికి మార్చాం. దాదాపుగా 60% కథని మార్చాం. చివరి 30 నిమిషాలు కొత్త కథలాగే అనిపిస్తుంది. ఫైట్ ఒకటే కామన్‌గా ఉంటుంది. కానీ మిగతాదంతా కొత్తగా ఉంటుంది.
తరుణ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మూవీ చూసి చాలా మెచ్చుకున్నారు. నాకంటే ఎక్కువగా ఆనందపడ్డారు. అలాగే ఈషా కూడా అద్భుతంగా నటించింది. వీరిద్దరితోపాటు అందరి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటూ అలరిస్తాయి.
ఒరిజినల్ నుంచి ఒక్క ట్రాక్ కూడా వాడుకోలేదు. కంప్లీట్‌గా కొత్త మ్యూజిక్ చేయడం జరిగింది. ఒరిజినల్ కంటే తెలుగులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. మొత్తం ఏడు పాటలు. అన్ని పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. ఇవివి సత్యనారాయణ సినిమాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఏ విధంగా రన్ అవుతుందో ఈ సినిమాలో కూడా అంత చక్కని వినోదం కుదిరింది. ఇందులోని డ్రామా, ఎమోషన్స్ విషయంలో దర్శకుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.
అందరికీ కనెక్ట్ అయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



