హీరో శర్వా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్‌గా కొనసాగుతూ, హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో శర్వా మీడియాతో సంభాషించారు. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు అనుకున్న రిజల్ట్ రావడం కూడా చాలా ఆనందాన్నిచ్చింది.
సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అయితే సంక్రాంతికి చివరిలో రావడానికి కారణం ఒకటే..అప్పటికే నాలుగు సినిమాలు బుక్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి చాలా పెద్ద లాంగ్ వీకెండ్స్ కలిసి వచ్చాయి. ఈనెల 23 నుంచి 26 వరకు మళ్లీ పెద్ద వీకెండ్ ఉంది. మేము కంటెంట్‌ని బలంగా నమ్మాం. సంక్రాంతి సీజన్‌లో ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాకు నిజమైంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమాకి చాలా మంచి లాంగ్ రన్ ఉంటుంది. ఈ సినిమా తొలి రోజు నుంచి చాలా నమ్మకం ఉంది. సినిమా ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అని మొదటి నుంచి చెప్తున్నాను.
నిర్మాత అనిల్ బిగ్ బ్రదర్ లాంటివారు. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేసాం. ఆయన నాకు ఎక్కువ బలం ఇచ్చారు. ఇండిస్టీకి రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్స్ కావాలి. తనకు చాలా క్లారిటీ ఉంటుంది.
‘బైకర్’లో రెండు రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాదర్ రోల్. ‘సూర్య సన్నాఫ్ కష్ణన్’లో సూర్య ఎలా కనిపిస్తారో అలాంటి క్యారెక్టర్. ఇండియా మొత్తం ఇండియా గర్వపడే సినిమా అవుతుంది. తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకొని చెప్పే సినిమా. శ్రీనువైట్లతో చేసే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ. చాలా అద్భుతమైన కథ కుదిరింది. సంపత్ నందితో ‘భోగి| సినిమా షూటింగ్ జరుగుతోంది. అది కూడా చాలా మంచి కథ.
ఈ విజయం గొప్ప ఆనందాన్నిచ్చింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



