Tuesday, February 10, 2026
E-PAPER
Homeసినిమాకానీ.. మీ ప్రేమ మాత్రం శాశ్వతం

కానీ.. మీ ప్రేమ మాత్రం శాశ్వతం

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్‌ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రం ఘన విజయం నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్‌ మెసేజ్‌ షేర్‌ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్‌ను చేరిన తెలుగు చిత్రంగా ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్‌ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ బుకింగ్‌లతో 9వ రోజున మరింత జోరుని కొనసాగి స్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం తాజాగా మరిన్ని మైలురాళ్ల దిశగా అడుగులు వేస్తోంది.
ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టిస్తూ, పండుగ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్న తరుణంలో చిరంజీవి ఈ విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా టీమ్‌కు కతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లోని ప్రతి మైలురాయి తరతరాల సినీ ప్రేమికుల అభిమానంతోనే రూపుదిద్దుకుందని తెలియజేశారు.
”మన శంకర వర ప్రసాద్‌ గారు’ సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను. ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు. ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది. థియేటర్లలో మీ విజిల్సే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి.. కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్‌ విజయం దర్శకుడు అనిల్‌ రావిపుడి, నిర్మాతలు సాహు, సుష్మితతో పాటు మొత్తం టీమ్‌ చేసిన కషికి నిదర్శనం. నాపై మీరు చూపించిన నమ్మకానికి ఇది అంకితం. వేడుకలు కొనసాగిద్దాం. లవ్‌ యూ ఆల్‌’ అని చిరు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -