నవతెలంగాణ – చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. విజయ్‌తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్ కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



