Tuesday, February 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునోటీసులకు భయపడేది లేదు

నోటీసులకు భయపడేది లేదు

- Advertisement -

– దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టు
– సింగరేణి టెండర్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి : సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎన్ని నోటీసులిచ్చినా భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ముగిసిన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఈ సిట్‌ నోటీసు అంతా ట్రాష్‌ అని విమర్శించారు. నిరాధార ఆరోపణలు, అడిగిందే మళ్లీ మళ్లీ పోలీసు అధికారులు అడిగారని చెప్పారు. రేవంత్‌కు దమ్ముంటే సింగరేణి టెండర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆయన బామ్మర్ది మొదటి దోషి అనీ, అన్ని ఆధారాలూ ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు. టెండర్ల కోసమే ఇదంతా చేస్తున్నారనీ, దాన్ని దారిమళ్లించడానికి సిట్‌ అంటున్నారని చెప్పారు. ఉద్యమాలు, అరెస్టులు తమకు కొత్త కాదని అన్నారు. ఈ నోటీసులు తన ప్రజాపోరాటానికి దక్కిన గౌరవంగానే భావిస్తానని వివరించారు. సుప్రీం, హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా సిట్‌ పేరుతో విచారణ జరుపుతున్నారని చెప్పారు. రుణమాఫీ ఏదంటే యాదాద్రిలో, ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే మానకొండూరులో, వరద బాధితులను పరామర్శిం చేందుకు వెళ్తే ఖమ్మంలో కేసులను నమోదు చేశారని అన్నారు. ఘోష్‌ కమిషన్‌ డొల్ల అనేది ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించానని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి స్కాంలకు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు. విచారణ తర్వాత లీకులిస్తారనీ, సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే విచా రణకు సంబంధించిన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామనీ, ప్రజలపక్షాన ఇంకా గట్టిగా కొట్లాడతా మని హెచ్చరించారు. కుంభకోణాలను బయటపెడు తూనే ఉంటామన్నారు. ఈ నోటీసులు రేవంత్‌ పతనానికి నాంది అన్నారు.తాము ధికారంలోకి రాగా నే బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపిస్తా మనీ, అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరిం చారు. విచారణకు వెళ్లే ముందు హరీశ్‌రావు తన నివాసం వద్ద, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

జైలుకు పంపాలన్న కుట్రతోనే నోటీసులు : కేటీఆర్‌
హరీశ్‌రావుపై కుట్రతో జైలుకు పంపాలన్న దురుద్దేశంతోనే సిట్‌ నోటీసులు పంపించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శిం చారు. ఆయనపై నమోదైన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. సిట్‌ విచారణ పేరుతో ఎన్ని తమాషాలు చేసినా కాంగ్రెస్‌ హామీల వైఫల్యం, పాలనా వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీశ్‌రావుకు నోటీసులిచ్చారని అన్నారు. సృజన్‌రెడ్డి అందర్నీ బెదిరిస్తున్నారని చెప్పారు. ఆ బెదిరింపులకు లొంగకుంటే సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌కు అర్హత ఉన్నా ఆ కంపెనీలకు ఇవ్వడం లేదన్నారు. సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్‌రెడ్డి అనీ, ఇందులో బీజేపీకి వాటాల్లేకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లేదంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఇందులో వాటాలున్నట్టు అనుకోవాల్సి వస్తుందన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

కక్షసాధింపులో భాగమే నోటీసులు : మధుసూదనాచారి
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు వచ్చాయని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కాంగ్రెస్‌ దోపిడీని ప్రశ్నించినందుకే హరీశ్‌రావుపై అక్రమ కేసులను నమోదు చేశారనీ, బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని మాజీమంత్రులు పి సబి తా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, జెడ్పీ మాజీ చైర్మెన్‌ తుల ఉమ, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, చిరుమళ్ల రాకేశ్‌కుమార్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, వాసుదేవరెడ్డి, టీజీపీఎస్సీ మాజీ సభ్యులు సుమిత్రానంద్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -