Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐద్వా పోరాటాలతో మహిళలకు హక్కులు : ఎస్‌.పుణ్యవతి

ఐద్వా పోరాటాలతో మహిళలకు హక్కులు : ఎస్‌.పుణ్యవతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరాటాలతో మహిళలకు హక్కులు దక్కాయని ఆ సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి తెలిపారు.
మంగళవారం ఐద్వా రాష్ట్ర కార్యాలయం వీరనారి ఐలమ్మ భవనం ముందు జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్నవేధింపుల నిరోధానికి ఐపీసీ 498ఎ సెక్షన్‌, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ల సాధన, గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐద్వా పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఛీప్‌ లిక్కర్‌ కు వ్యతిరేకంగా పోరాడిన ఐద్వా ఇంటి పనివారల కోసం స్నేహ ఇంటి పనివారల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి కనీస వేతన చట్టం సాధించిందని గుర్తుచేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 28 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే 14వ జాతీయ మహా సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి వర్థిల్లాలని గ్రామ కమిటీ, వార్డు కమిటీలు ఉన్న ప్రతి చోట ఐద్వా జెండా ఎగురవేయాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతి, సహాయ కార్యదర్శులు కెఎన్‌ ఆశాలత, బుగ్గవీటి సరళ, ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకులు విజయమ్మ, స్వర్ణలత, రజిత, సత్తమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -