- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పాఠశాల అనుమతి విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
- Advertisement -



