- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2026 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా, మెగాస్టార్ చిరంజీవి జ్యూరిచ్‌లో ఉన్న విషయం ఆయనకు తెలిసింది. వెంటనే మెగాస్టార్‌ను దావోస్ సమ్మిట్‌కు ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించిన చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సదస్సుకు హాజరయ్యారు.
- Advertisement -



