నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామ సర్పంచ్ శంకర్ (జైపటేల్) ప్రధాన రోడ్డుకు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జెసిబి ఏర్పాటు చేసి తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల వలన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు సర్పంచి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు ఏర్పాటు, త్రాగునీరు, వీధులను శుభ్రంగా ఉంచడం తదితర విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని సర్పంచ్ అన్నారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యలయ ఆవరణలో రెండవ విడత ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఆయన వెంట వార్డు సభ్యులు సునీత, మొగులవ్వ, జెంషెట్టి ప్రకాశ్, ఎడ్లసాయిలు, గ్రామ పెద్దలు అజయ్ పటేల్, హనుమంత్ రావు పటేల్, గ్రామ కార్యదర్శి, ప్రజలు పాల్గొన్నారు.
పిచ్చి మొక్కల తొలగింపు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



