నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ పెరెజ్ – కాస్టెజోన్ భారత్ పర్యటన ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ బుధవారం తెలిపారు. బహుశా ప్రధాని మోడీ కూడా స్పెయిన్‌ని సందర్శించే అవకాశం ఉందని ఆయన అన్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారత విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ మహాసముద్రాల ప్రాంతాల దేశాలతో, యూరోపియన్ యూనియన్ ద్వారా ద్వైపాక్షికంగా పనిచేయడానికి స్పెయిన్ ఆసక్తిగా ఉందని అల్బారెస్ ఈసందర్భంగా చెప్పారు. అలాగే ఇటీవల స్పెయిన్‌లో బార్సిలోనాలో జరిగిన రైలు ప్రమాదంలో 40 మందికిపైగా మృతి చెందారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో స్పానిష్ ప్రజలకు, ఈ ఘటన బాధితులకు సంఘీభావ సందేశం పంపినందుకు భారత విదేశాంగశాఖామంత్రి జైశంకర్‌కు అల్బారెస్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌కు రానున్న స్పెయిన్ అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



