నవతెలంగాణ – జుక్కల్ : మంగళవారం బీఆర్ఎస్ యువనాయకుడు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అనుచరుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మృతడు కిరణ్ కుటుంబాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. కిరణ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అని అన్నారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. నేడు కిరణ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హన్మంత్ షిండే పాల్గొని, కిరణ్ పాడె మోసి, కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో షిండే తనయుడు హరీష్ షిండే కూడా పాల్గొని నివాళులర్పించారు.
కిరణ్ అంత్యక్రియల సందర్భంగా జుక్కల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి, వేదనతో ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే జుక్కల్ మండలంలోని అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంబ్లె కిరణ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కాంబ్లె కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్తించారు.



