Saturday, May 24, 2025
Homeజాతీయంసామూహిక లైంగికదాడినిందితులకు బెయిల్‌..

సామూహిక లైంగికదాడినిందితులకు బెయిల్‌..

- Advertisement -

బయటకు వచ్చాక కార్ల ర్యాలీతో హల్‌చల్‌
బెంగళూరు :
కర్నాటకలోని హవేరీలో గతేడాది ఓ మహిళపై ఏడుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు రోడ్లపై విక్టరీ పరేడ్‌ మాదిరి ర్యాలీగా వెళ్లి హల్‌చల్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఇది తీవ్ర వివాదాస్పదమైంది.
హవేరిలోని అక్కి అలూర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితు లకు వారి స్నేహితులే ఇలా స్వాగత ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కార్లు, బైక్‌ల మీద స్పీడ్‌గా వెళ్తూ.. బిగ్గరగా అరుస్తూ వారు వేడుకలు చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఏంటీ కేసు..?
2024 జనవరి నాటి కేసు ఇది. తనపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనగల్‌లోని ఓ ప్రయివేటు హోటల్‌లో తన స్నేహితుడితో ఉండగా.. నిందితులు తమ గదిలోకి దౌర్జన్యంగా చొరబడినట్టు తెలిపారు. అనంతరం తనను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. బాధితురాలు తొలుత నిందితులను గుర్తించినప్పటికీ.. కోర్టు విచారణ సమయంలో వారిని గుర్తుపట్టడటంలో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో నిందితుల్లోని 12 మంది పది నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి మాత్రం ఇటీవలే బెయిల్‌ లభించింది. ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -