Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణాలు

నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని పలు వీధులలో వేసిన సీసీరోడ్డు నిర్మాణాలు నాసిరకంగా వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని దగ్గర అవసరం ఉన్న చేప వేయాల్సింది పోయి వేయలేదు. వారికి అనుకూలంగా ఉన్న అనుయాయుల చెప్పిన చోట సిసి రోడ్డు వేసి ప్రజాధనం వృధా చేశారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ కొరవడిందని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. సదరు గుత్తేదారునికి పీ ఆర్ అధికారుల కమిషన్లకు కక్కుర్తి పడి పూర్తిగా అండదండలు ఉండడంతో వారి ఇష్ట రాజ్యంగా రోడ్లు నాసిరకంగా వేశారు.

ఇలా మండల కేంద్రంలోని కటిక వీధి, మొరం సందర్భంగా పీర్లు కూర్చుండబెట్టే మసీదు వద్ద వేసినా సిసి రోడ్డు, బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ దేశాయ్ రామ్ మందిర్ వద్ద గల వీధిలో వేయాల్సిన సిసి రోడ్డు వారు అనుయయులకు అనుకూలంగా, వ్యాపార అవసరాలకు వాడుకునే నిర్మించుకున్న షట్టర్లు వద్ద, గోదాముల వద్ద జుక్కల్ ప్రయాణ ప్రాంగణం సమీపాన పాత వైన్స్ ఉండే వీధిలో వేయడం జరిగింది. ఇలా అధికారులు పట్టించుకోకపోవడంతో గుత్యదారుడు ఇష్టం వచ్చినట్టు తనకు తోచిన విధంగా అనుమతులు ఉన్నచోట వేయకుండా, అనుమతులు లేని వద్ద వేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -