నవతెలంగాణ-కమ్మర్ పల్లి
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపరాదని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంతంలోఅరైవ్…అలైవ్ కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని,అధిక వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రాణాలకు ప్రమాదమని ప్రజలకు వివరించారు.వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు సకాలంలో చెల్లించాలని సూచించారు. అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ లేనిదే వాహనం నడపరాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



