Monday, May 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.225 రీఛార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా నెలకు మొత్తం 75 GB డేటా లభిస్తుంది. ప్రయివేటు టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఎక్కువ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ముఖ్యంగా సెకండరీ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వారికి, తక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -