- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం, సామూహిక బోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు బెజుగం వెంకటేశం, కార్యదర్శి కోట సుధాకర్, క్యాషియార్ జొన్నల భూషణ్, కార్యవర్గ సభ్యులు కటకం భాస్కర్, ఆమెద నరేందర్, చిటికేసి కిరణ్, ఉత్తర్ రాజేంధర్, నూనెవర్ శ్రీనివాస్, ఆర్య వైశ్య కుటుంబాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



