Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష

విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం సోషల్ ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్ష  నిర్వహించారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో ప్రథమ స్థానం సట్ట ప్రణవి, (చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ద్వితీయ స్థానం శాలిని (ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), తృతీయ స్థానంలో జి. రాజేశ్వరి (కోనసముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) విజయం సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో సాంఘిక శాస్త్రం యొక్క ప్రాధాన్యతను గుర్తించి సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న,  పీజీ హెచ్ఎం రాజన్న, సోషల్ ఫోరం మండల అధ్యక్షుడు రమేష్, కన్వీనర్ అంబటి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -