- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజి వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్ఆర్ ఫామ్ నిర్వాకులు అరవింద్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు ఆట వస్తువులు అందించారు. అలాగే పాఠశాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ ఫామ్ నిర్వాహకులకు అడగగానే ఆట వస్తువులు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోకోటి సుబ్బారావు ,ఉప సర్పంచ్ నల్లవెల్లి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



