ఎంవిఐ రాహుల్ కుమార్
నవతెలంగాణ – ఆర్మూర్
విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమా నిబంధనలను పాటించాలని మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల యందు బుధవారం విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనము మంచిగా ఉన్నప్పుడే మన కుటుంబం, సన్నిహితులు, స్నేహితులు అందరూ మంచిగా ఉంటారని ,హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు చేయడం, త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటివి ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అన్నారు. అందుచేత విధిగా జాగ్రత్తలు టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ , ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



