Wednesday, January 21, 2026
E-PAPER
Homeజిల్లాలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలో అమృత్ 2.0 వాటర్ సప్లై శంకుస్థాపన కార్యక్రమానికి, పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జ్  మంత్రి సీతక్క బుధవారం ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని ఆహ్వానించారని, పలు సమస్యలపై నిరంతరం వినతులు ఇస్తున్నాడని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నామని, గోదావరి పరివాహక ప్రాంతమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా మేడారం జాతరకు వస్తారని తెలిపారు. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో ఏర్పాట్ల పై ఎమ్మెల్యే వినతి పరిశీలించి నిధులు మంజూరు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -