సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
డబ్బు, మద్యం, కులం, మతం తో వచ్చే నాయకులను ఓడించలని, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ఎర్రజెండా బిడ్డలను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ అన్నారు. బుధవారం ఆలేరు సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశము వడ్డేమాన్ బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ .. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే ఎర్రజెండా బిడ్డలను గెలిపించాలని డబ్బులు-మందుతో ప్రలోభపెట్టే వారిని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, మున్సిపాలిటీలకు సొంత భవనాలు, చెత్త, డంపింగ్ యార్డులు లాంటి కనీస వసతులు లేకుండా మున్సిపాలిటీలు ప్రజలకు ఎలా సేవలు అందిస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎన్నికల రాగానే డబ్బు సంచుల తోటి రాజకీయాల్లోకి వచ్చే దొంగ నాయకులను భూదందగాలను బుద్ధి చెప్పాలని, నిరంతరం ప్రజల కోసం శ్రమించే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
తమ సొంత ప్రయోజనాల కోసం ఎన్నికల అప్పుడు డబ్బు, మద్యం, కులం అనే సంకుచిత మనసుతో రాణించాలని చూసే నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) అన్ని మున్సిపాలిటీలలో తమకు ప్రాతినిధ్యం వహించే విధంగా పోటీ చేస్తుందని ఎర్రజెండా బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మొరిగాడి రమేష్, ఘణగాని మల్లేష్, తాళ్లపల్లి గణేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, బొప్పిడి యాదగిరి, గొడుగు శాంత, కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.



