Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడికి ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ అందజేత

అంగన్వాడికి ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహాదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో మండలంలోని వళ్లెంకుంట సెక్టార్ కొండంపేట గ్రామ అంగన్ వాడి కేంద్రంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో పిల్లలకు (పీస్య్కుల్) మెటీరియల్ సంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించినట్లుగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా ఇంచార్జి సిడిపిఓ హాజరై మాట్లాడారు. అరుణ మాట్లాడుతూ.. ఆటపాటలతో కూడిన విద్య అందించడమే అంగన్వాడి లక్ష్యమని తెలిపారు. పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపితే మానసిక, శారీరక, మేధో, సృజనాత్మకత అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందన్నారు. ప్రథమ్ ఫౌండేషన్ మాస్టర్ (ట్రైనర్ జి.సమ్మయ్య మాట్లాడుతూ.. మెటీరియల్ ద్వారా పిల్లల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, జి.పి.ఒ, కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, అశాలు, పిల్లల, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -