Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం అందుకున్న సుధాకర్ 

అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం అందుకున్న సుధాకర్ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
పెద్దవంగర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ కవి, రచయిత, గాయకుడు మద్దెల సుధాకర్ గౌడ్ ‘అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం’ అందుకున్నారు. బుధవారం విజయవాడ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి ఫెస్టివల్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన కవి సమ్మేళనం లో సుధాకర్ హాజరై, కవితా గానం చేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం చేతుల మీదుగా ఆయన ‘అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం’ స్వీకరించారు. కాగా ఆయన సుదీర్ఘకాలంగా తెలుగు సాహిత్యం, సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు కళల పరిరక్షణ కోసం తన కవిత్వంతో ప్రజలను చైతన్య పరుస్తూ, పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -