- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఎన్యూమారేటర్లకి, సూపర్వైజర్లకి జనగణలో ప్రజలు సహకరించాలని, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి కోరారు. ఆలేరు మున్సిపాలిటీలో సోమవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వారికి కేటాయించిన బ్లాకులలో తిరిగి ప్రతి ఇంటింటికి నెంబరు కేటాయించడం, రఫ్ మ్యాప్ తయారు చేయడం వంటి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజర్ జగన్ మోహన్, మాస్టర్ ట్రైనర్ దూడల వెంకటేష్, సూపర్వైజర్ పోరెడ్డి రంగయ్య, ఇతర సూపర్వైజర్లు, ఎన్యూమారేటర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



