Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంకొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి బలుగూరి రామిరెడ్డి మృతదేహం

కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి బలుగూరి రామిరెడ్డి మృతదేహం

- Advertisement -

నవతెలంగాణ-అశ్వాపురం
సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి బలుగూరి మధు తండ్రి బలుగూరి రామిరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఆయన కుటుంబ సభ్యు లు కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అందజేశారు. చనిపోయిన తర్వాత కూడా తన తండ్రి మృతదేహం వైద్య కళాశాల విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం ఉపయో గపడాలని అందజేసినట్టు ఈ సందర్భంగా మధు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెంది న బలుగూరి రామిరెడ్డి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజారావు, సోమన్న, రమేష్‌, సుధాకర్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. బ్రహ్మచారి, ఏజే రమేష్‌ నివాళి అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -