- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కోరినట్టు ప్రాజెక్టు సిడిపిఓ భార్గవి బుధవారం తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా,శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



