- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వాడు లక్ష్మీనరసింహ కాలనీలో ఐద్వా జెండాను జిల్లా కార్యదర్శి లక్ష్మి ఎగరవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మాసభలో హైదరాబాదులో ఈనెల 25 తారీకు నుంచి 28 వరకు జరగబోతున్నాయన్నారు. 25న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని, బహిరంగ సభ జయప్రదం చేయాలనిఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రేణుక, ఐద్వా కమిటీ సభ్యులు కమల, పార్వతి, సుశీల, రమీజా, జ్యోతి, భాగ్యమ్మ, షబానా బేగం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



