మలయాళ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లి చట్టంబి’. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. ఏప్రిల్ 9న ఈ మూవీని హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నారు. విడుదలైన మోషన్ పోస్టర్ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచుతోంది. విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్, ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్, సినిమాటోగ్రఫీ – టిజో టోమీ, మ్యూజిక్ – జేక్స్ బిజోయ్, స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్, ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్.
భారీ పీరియాడికల్ చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



