Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'డెకాయిట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘డెకాయిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో అడివి శేష్‌ త్వరలో ‘డకాయిట్‌’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఒక భారీ షెడ్యూల్‌లో ఆమె తన షూటింగ్‌ పార్ట్‌ని ఫినిష్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆమెకు ఘనంగా సెండ్‌ అఫ్‌ ఇచ్చింది. అలాగే ఆమె ఇక అన్ని ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌లో భాగమవుతారు. అలాగే ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ రెండు భాషలలో డబ్బింగ్‌ కూడా చెబుతున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేసిన సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. శేష్‌ డిఫరెంట్‌ అవతార్‌, రఫ్‌ లుక్స్‌, మాస్‌ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -